![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ సిక్స్ తో ఫేమస్ అయిన వారిలో వాసంతి ఒకరు. తన ఎంగేజ్ మెంట్ కి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ అంతా హాజరయ్యారు. ఆ మధ్య అది ఫుల్ వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే.
బిగ్ బాస్ సీజన్ సిక్స్ అనగానే కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి గుర్తొస్తాడు. ఆ తర్వాత గీతు రాయల్. శ్రీహాన్, కీర్తిభట్, సింగర్ రేవంత్, ఇనయా సుల్తానా, వాసంతి కృష్ణన్ , అర్జున్ కళ్యాణ్ , శ్రీసత్య, ఫైమా, ఆరోహీ రావు, ఆర్జే సూర్య లు ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు.
గీతు రాయల్ ఎలిమినేట్ అయ్యాక యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో తన ప్రతీ అప్డేడ్ ని తెలియజేస్తూ తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ' వాసంతి ఎంగేజ్ మెంట్ కి తిరుమలకి వెళ్ళాం.. సత్యకి మాకు పెద్ద గొడవ '.. అనే వ్లాగ్ ని అప్లోడ్ చేసింది. ఇందులో శ్రీసత్య, యాంకర్ ధనుష్, ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి గీతు రాయల్ తిరుమలకి వెళ్ళింది. అక్కడ జరిగిన ప్రతీ సంఘటనని ఈ వ్లాగ్ లో క్లిప్స్ గా చేసి అప్లోడ్ చేసింది. అయితే అక్కడ శ్రీసత్య, గీతు రాయల్ మధ్య చిన్న గొడవ జరిగిందని అది ఎందుకో చెప్పుకొచ్చింది గీతు. ఇలాంటి గొడవలంటే నెటిజన్లకి ఇష్టం కాబట్టి అది ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది.
![]() |
![]() |